భోపాల్: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మంటలు ఎగసిపడ్డాయి. ఇది చూసి స్థానికులు భయాందోళన చెందారు. (Fire Erupts In Chemical Factory) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ సంఘటన జరిగింది. శనివారం గోవింద్పురలోని పెయింట్ తయారీ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జేకే రోడ్లోని టాటా మహీంద్రా షోరూమ్ వెనుక ఉన్న ఈ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. 20 అడుగుల ఎత్తు వరకు మంటలు ఎగసిపడ్డాయి. పొగలు దట్టంగా వ్యాపించాయి. ఈ మంటలు, పొగలు చాలా దూరం నుంచి కనిపించాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. సమీపంలోని షాపులను వ్యాపారులు మూసివేశారు.
కాగా, పలు ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలు అక్కడకు చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. జనం పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. మరోవైపు ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#WATCH | MP: Massive Fire Breaks Out Near Mahindra Showroom On JK Road In Bhopal#Bhopal #MadhyaPradesh #MPNews pic.twitter.com/FrmCpgOGhV
— Free Press Madhya Pradesh (@FreePressMP) March 1, 2025