కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ప్రభుత్వ దవాఖానలో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని ఎస్ఎస్కేఎం ప్రభుత్వ దవాఖానలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దవాఖానలో రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. నిమిషాల వ్యవధిలోనే అవి సీటీ స్కాన్, ఎక్స్ రే రూంలోకి వ్యాపించాయి. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. సమాచారం అందున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పది ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు.
అగ్ని ప్రమాదంలో రోగులెవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే అగ్నిప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.