న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీలోని సమల్కా కపషేరాలోని సోనియా గాంధీ క్యాంప్‌లో (Sonia Gandhi camp) ఉన్న కలప గోదామ్‌లో (Lumber store Godown) అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా టిక్రీ కలాన్‌లో (Tikri Kalan) ఉన్న పీవీసీ మార్కెట్ (PVC Market) భారీ అగ్నిప్రమాదం (Massive fire) జరిగింది. ప్లాస్టిక్ గోదాం (Plastic godown) కావడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. దీంతో పెద్దఎత్తున అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలముకున్నాయి. కిలోమీటర్ దూరంలో కూడా మంటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 26 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగలేదని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఎస్కే దువా చెప్పారు. వీలైనంత తొందరగా మంటలను ఆర్పివేస్తామని చెప్పారు.
As soon as the information was received, 26 fire tenders reached the spot. The fire was spreading quickly due to the wind. This fire has been declared of medium category. There is no information about loss of life or property so far. Situation under control: SK Dua, Deputy Chief… pic.twitter.com/1Mu0dr7u3Y
— ANI (@ANI) April 8, 2023