అహ్మదాబాద్: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం రికార్డు స్థాయిలో రూ.1,646 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని స్వాధీనం చేసుకుంది. మోసపూరిత పెట్టుబడుల పథకం గుట్టును రద్దు చేసింది. సెక్యూరిటీస్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో వందలాది మంది డిపాజిటర్లు మోసపోయినట్లు గుర్తించింది. ‘బిట్ కనెక్ట్ లెండింగ్ ప్రోగ్రామ్’ నిర్వాహకులు ఈ మోసానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. 2016 నవంబర్- 2018 జనవరి మధ్య ఈ మోసం జరిగింది.