ముంబై, జూలై 10( నమస్తే తెలంగాణ): ఎనిమిది నెలల్లో 9 మందిని పెండ్లి చేసుకుని లక్షలాది రూపాయలు దోచుకొని పారిపోయిన ఒక కిలాడి పెళ్లి కూతురు సహా 12 మంది ముఠాను అహ్మదానగర్ జిల్లా శ్రీగోందా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.13 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
సిమ్రాన్ అనే యువతి హైదరాబాద్, గుజరాత్, మధ్యప్రదేశ్, ముంబైలో అమాయక యువకులను పెళ్లి చేసుకుని లక్షలాది రూపాయలు దండుకొని పారిపోయేదని పోలీసుల విచారణలో తేలింది. తాజాగా మహారాష్ట్రలో నితిన్ ఉల్గే అనే యువకుడిని సిమ్రాన్ పెండ్లి చేసుకుని పరారవ్వడానికి ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు.