Maharashtra | ముంబై : దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 20 మందిని మోసగించి, పెండ్లి చేసుకున్న ఫిరోజ్ నియాజ్ షేక్ (43)ను మహారాష్ట్ర పోలీసులు ఈ నెల 23న అరెస్ట్ చేశారు. నల్ల సోపారలోని ఓ మహిళను మాట్రిమోనియల్ వెబ్సైట్లో నిందితుడు చూసి, స్నేహం చేసి, పెండ్లి చేసుకున్నాడు. 2023లో ఆమె నుంచి ల్యాప్టాప్, ఇతర విలువైన వస్తువులు, నగదు తీసుకున్నాడు.
నిందితుడు విడాకులు తీసుకున్న, వితంతు మహిళలను లక్ష్యంగా చేసుకుని, స్నేహం నటించి, వివాహం చేసుకుని, వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకునేవాడు. 2015 నుంచి ఇప్పటి వరకు సుమారు 20 మంది మహిళలను మోసం చేశాడు.