రోహ్తక్: తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించారన్న కోపంతో ఓ వ్యక్తి హర్యానాలోని జింద్ జిల్లా పిల్ ఖేరా వద్ద ఇద్దరు అక్కచెల్లెళ్లపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన సీను(27), రీతు(21) అనే ఇద్దరు ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కల్వా గ్రామానికి చెందిన ఈ యువతులు షాపింగ్ చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
కర్నల్కు చెందిన సునీల్ కుమార్ వీరిపై తుపాకీతో కాల్పులు జరిపి కారులో పారిపోయినట్లు వారు చెప్పారు. నిందితుడు బాధిత మహిళలకు బంధువవుతాడని వారు చెప్పారు. రీతూను వివాహం చేసుకోవాలని నిందితుడు భావించాడని, అయితే రీతూ తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదని, దీంతో అతడు ఇద్దరు సోదరీమణులపై కాల్పులు జరిపినట్టు సమాచారం.