పిల్లల దత్తతకు… వివాహ ధృవీకరణ పత్రం అవసరం లేదు: హైకోర్టు
లక్నో: పిల్లలను దత్తత తీసుకోవడానికి వివాహ ధృవీకరణ పత్రం అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 ప్రకారం సింగిల్ పేరెంట్ కూడా బిడ్డను దత్తత తీసుకోవచ్చని తెలిపింది. పిల్లల దత్తతకు సంబంధించిన ఒక కేసు విచారణపై ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన ట్రాన్స్జెండర్ రీనా కిన్నార్, 2000 డిసెంబర్ 16న ఒక యువకుడ్ని పెండ్లి చేసుకుంది. ఈ జంట ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని నిర్ణయించింది.
బిడ్డ దత్తత కోసం సంబంధిత అధికారులను వారు ఆశ్రయించారు. అయితే పిల్లల దత్తత కోసం వివాహ ధృవీకరణ పత్రం అవసరమని చెప్పారు. దీంతో రీనా జంట తమ వివాహం నమోదు కోసం వారణాసి జ్లిలా సబ్ రిజిస్ట్రర్కు ఆన్లైన్ ద్వారా 2021 డిసెంబర్లో దరఖాస్తు చేశారు. అయితే అది పెండింగ్లో ఉండటంతో అలహాబాద్ హైకోర్టును వారు ఆశ్రయించారు.
ఈ నెల 9న జస్టిస్ వివేక్ వర్మ, జస్టిస్ డాక్టర్ కౌశల్ జయేంద్ర ఠాకర్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. పిల్లలను దత్తత తీసుకోవడానికి వివాహ ధృవీకరణ పత్రం అవసరం లేదని ఆ బెంచ్ తెలిపింది. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 ప్రకారం సింగిల్ పేరెంట్ కూడా బిడ్డను దత్తత తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

