CIBIL Score | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: సిబిల్ స్కోర్ విషయంలో పెండ్లి కాని యువకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఈ ఘటన చూస్తే తెలుస్తుంది. సిబిల్ స్కోర్ కారణంగా ఒక యువకుడికి కొద్ది రోజుల్లో జరగాల్సిన పెండ్లి ఆగిపోయిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ముర్తిజాపూర్కు చెందిన యువతితో ఒక యువకుడికి పెండ్లి నిశ్చయించారు.
అయితే ముహూర్తానికి కొద్ది రోజుల ముందు వధువు మేనమామ ఆ యువకుడి సిబిల్ స్కోర్ పరిశీలించగా, అతని సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నట్టు గుర్తించాడు. అప్పటికే వరుడు రుణ భారం, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాడని, అలాంటి వ్యక్తికి తమ బిడ్డనిచ్చి పెండ్లి చేస్తే ఆమె భవిష్యత్తు అభద్రతలో పడుతుందని భావించి పెండ్లిని రద్దు చేశారు. దీంతో వరుడి కుటుంబం షాక్కు గురైంది.