జాల్నా, ఆగస్టు 5: ఈ ఏడాది అక్టోబర్లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ తరఫున పోటీ చేయగలిగే అభ్యర్థుల డాటా అందుబాటులోనే ఉందని మరాఠా రిజర్వేషన్ల ఉద్యమ నేత మనోజ్ జారంగే తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయమని తమను బలవంతం చేయవద్దని ఆయన కోరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 29న తమ సామాజికవర్గ నేతలతో సమావేశమై 288 స్థానాలున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్న విషయాన్ని నిర్ణయిస్తామని తెలిపారు.