జాల్నా: మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మరాఠా ఉద్యమ నేత మనోజ్ జరాంగే పాటిల్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని మరాఠా కమ్యూనిటీ అందిరికీ ఓబీసీ క్యాటగిరీ కింద కుంబీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సిందేనని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తన నిరాహార దీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో భాగంగా ఆదివారం నుంచి నీరు, మెడిసిన్ తీసుకోవడం ఆపేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో జాల్నా జిల్లా అంతర్వాలి సారథి గ్రామంలోని శిబిరంలో జరాంగే చేస్తున్న నిరాహార దీక్ష శనివారంతో 12వ రోజుకు చేరుకొన్నది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరాఠ్వాడా రీజియన్‌లో మరాఠాలకు కుంబి సర్టిఫికెట్లు జారీకి సంబంధించిన ప్రభుత్వ తీర్మానాన్ని సవరించాలని ఆయన డిమాండ్ చేశారు.