Maoists | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. బస్తర్‌లో 37 మంది లొంగుబాటు
Maoists | మావోయిస్టుల (Maoists) కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ (Chattishgarh) రాష్ట్రంలోని బస్తర్ రీజియన్ (Bastar region) దంతెవాడ జిల్లా (Dantewada district) లో ఆదివారం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
Maoists : మావోయిస్టుల (Maoists) కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ (Chattishgarh) రాష్ట్రంలోని బస్తర్ రీజియన్ (Bastar region) దంతెవాడ జిల్లా (Dantewada district) లో ఆదివారం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 27 మందిపై మొత్తం రూ.65 లక్షల రివార్డు ఉందని అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘లోన్ వర్రాటు’, ‘పూనా మర్గం’ పథకాలకు ఆకర్షితులై వారు లొంగిపోయారని చెప్పారు.
తాము హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ పునరావాస విధానంపై తమకు పూర్తి నమ్మకం ఉందని లొంగిపోయిన మావోయిస్టులు చెప్పారు. దంతెవాడలోని డీఆర్జీ కార్యాలయంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారుల సమక్షంలో వారు లొంగిపోయారు. వాళ్లలో 12 మంది మహిళలు కూడా ఉన్నారు. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

