ముంబై: మద్యం, డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తి తల్లిని డబ్బులు డిమాండ్ చేశాడు. ఇచ్చేందుకు ఆమె నిరాకరించడంతో అతడు ఆగ్రహించాడు. అపార్ట్మెంట్లో పార్క్ చేసిన బైకులకు నిప్పుపెట్టాడు. నివాసితుల ఫిర్యాదుతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. (man set fire to bikes) మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. 27 ఏళ్ల స్వప్నిల్ మద్యం, మత్తుపదార్థాలకు బానిసయ్యాడు. కుటుంబం అతడ్ని పునరావాస కేంద్రంలో చేర్చినప్పటికీ మార్పురాలేదు. డబ్బులు కోసం కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు.
కాగా, బుధవారం తెల్లవారుజామున స్వప్నిల్ ఇంటికి వచ్చాడు. మద్యం, డ్రగ్స్ కోసం డబ్బులు ఇవ్వాలని తల్లిని అడిగాడు. డబ్బులు ఇచ్చేందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన అతడు అపార్ట్మెంట్ సెల్లార్లో పార్క్ చేసిన బైకులపై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు పదికిపైగా బైకులు కాలిపోవడంపై నివాసితులు ఆగ్రహించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. స్వప్నిల్ ఈ పని చేసినట్లు గుర్తించారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్వప్నిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, తన కుమారుడ్ని విడిచిపెట్టవద్దని, జైల్లోనే ఉంచాలని పోలీసులను అతడి తల్లి వేడుకున్నది. మద్యం, డ్రగ్స్‌కు బానిసైన స్వప్నిల్ చాలా కాలంగా తమ కుటుంబాన్ని వేధిస్తున్నాడని వాపోయింది. డబ్బులు ఇవ్వకపోతే తమను చంపుతామని లేదా చచ్చిపోతానని బెదిరిస్తున్నాడని ఆరోపించింది. అలాగే అపార్ట్మెంట్ బిల్డింగ్‌కు నిప్పుపెడతానని అతడు హెచ్చరించినట్లు పోలీసులకు చెప్పింది.
అయితే ఇంజినీరింగ్ చదివిన స్వప్నిల్ మద్యం, డ్రగ్స్‌కు బానిసయ్యాడని అపార్ట్మెంట్ నివాసితులు తెలిపారు. కుటుంబం అతడ్ని పునరావాస కేంద్రంలో చేర్చినప్పటికీ మార్పురాలేదని చెప్పారు.
Pune: When mother refused to give him money for alcohol, the man set fire to 13 bikes parked in the society.
The accused, identified as Swapnil Shivsharan Pawar, was later arrested. pic.twitter.com/hazW4esl1C
— زماں (@Delhiite_) March 11, 2025