న్యూఢిల్లీ : బెల్లీ డ్యాన్స్ చేస్తున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కావేరి అనే యూజర్ ఈ వైరల్ వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా ఇప్పటివరకూ లక్షకు పైగా వ్యూస్ లభించాయి. ఈ వీడియోలో ఓ యువకుడు బెల్లీ డ్యాన్స్ పెర్ఫామెన్స్‌లో అదరగొట్టాడు.
He is so bloody good at it! pic.twitter.com/fxNbzl4AKE
— Kaveri 🇮🇳 (@ikaveri) January 18, 2023
48 సెకండ్ల వ్యవధి కలిగిన ఈ క్లిప్‌లో యువకుడు తన బెల్లీ డ్యాన్స్‌తో మతులు పోగొట్టాడు. మంచి ఈజ్, గ్రేస్‌తో అతడి మూమెంట్స్ నెటిజన్లను ఆకట్టుకుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించిన హుషారైన బీట్స్‌కు అనుగుణంగా క్రేజీ మూమెంట్స్‌తో అలరించాడు.
అతడి గ్రేస్‌ఫుల్ పెర్ఫామెన్స్‌ను మెచ్చిన నెటిజన్లు కామెంట్స్ సెక్షన్లో ప్రశంసలు గుప్పించారు. అతడి డ్యాన్స్ బ్రిలియంట్ అని ఓ యూజర్ రాసుకురాగా, అతడికి ఇదో వరమని మరో కామెంట్ వ్యాఖ్యానించారు.