Budget 2024-25 : రానున్న కేంద్ర బడ్జెట్ సామాన్యుడి ఆశలు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఆర్జేడీ నేత మనోజ్ ఝా కోరారు. సామాన్యుడి సమస్యలు, ఆవేదనలకు ఇది దూరంగా ఉండకూడదని అన్నారు. బడ్జెట్ ఉపాధి రహిత, మానవతా రహిత, అంకెల గారడీగా మిగిలిపోకూడదని చెప్పారు.
ప్రజా తీర్పునకు లోబడి ఈసారి బడ్జెట్ సందర్భంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పాలకపక్ష బృందమంతా సామాన్యుడి సమస్యలే అజెండాగా బడ్జెట్ రూపకల్పనకు కసరత్తు సాగిస్తాయని భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. మరోవైపు బడ్జెట్ సమావేశాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం సాఫీగా సాగేలా వ్యవహరించాలని తాము కోరుకుంటున్నామని, ఎలాంటి అవరోధం లేకుండా బడ్జెట్ సమావేశాలు సాగాలని విపక్ష నేతలను తాము కోరుతున్నామని జేడీ(యూ) నేత కేసీ త్యాగి తెలిపారు.
కాగా నరేంద్ర మోదీ సారధ్యంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తున్న టీడీపీ, జేడీ(యూ) రానున్న బడ్జెట్లో ప్రత్యేక ప్యాకేజ్‌ల కింద భారీ నిధులను డిమాండ్ చేస్తున్నాయనే వార్తలు గుప్పుమన్నాయి. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు ఈ దిశగా కాషాయ పాలకులపై ఒత్తిడి పెంచుతున్నారని బ్లూమ్‌బర్గ్ కథనం పేర్కొంది.
Read More :
Tech tips | అప్పుడప్పుడు ఆధార్ హిస్టరీ చెక్ చేసుకోండిలా.. ఎందుకంటే..!