Tech tips : ఆధార్ కార్డు ప్రస్తుతం అన్నింటికీ అతి ముఖ్యమైన డాక్యుమెంట్ అయ్యింది. బ్యాంకుల్లో ఖాతా తెరవాలన్నా, కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా ప్రతి దానికి ఆధార్ కార్డును సమర్పించాల్సిందే. అవసరమున్న ప్రతి చోటా ఆధార్ కార్డు ఇచ్చేస్తున్నాం. దాంతో ఈ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నామో కూడా తెలియట్లేదు. ఒక్కోసారి ‘వేరెవరైనా మన కార్డును దుర్వినియోగం చేస్తున్నారా..?’ అనే అనుమానం కూడా కలుగుతుంది. అలా అనుమానం కలిగినప్పుడు మీ అనుమానం తీరాలంటే కార్డు హిస్టరీని చెక్ చేయాలి. దాని ద్వారా మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ కార్డును వినియోగిస్తే సులువుగా కనిపెట్టవచ్చు. మరి అదెలాగో చూద్దాం..