మణిపూర్‌లో ఉగ్రదాడి.. కర్నల్తోపాటు ఏడుగురు దుర్మరణం
Manipur: Convoy of Assam Rifles unit CO ambushed, casualities feared | మణిపూర్‌లో ఉగ్రవాదులు మెరుపు దాడి చేశారు. 46 అస్సాం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్, ఆయన కుటుంబమే లక్ష్యంగా ఈ దాడి

ఇంఫాల్ : మణిపూర్‌లో ఉగ్రవాదులు మెరుపు దాడి చేశారు. 46 అస్సాం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్‌తో పాటు సిబ్బంది లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటన భారత్ – మయన్మార్‌కు సరిహద్దు, చురాచంద్పూర్ జిల్లాలోని సింఘత్ సబ్ డివిజన్లో చోటు చేసుకున్నది. దాడి జరిగిన సమయంలో క్విక్ రియాక్షన్ టీమ్‌తో పాటు కర్నల్ విప్లవ్ త్రిపాఠితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కాన్వాయ్‌లోనే ఉన్నారు. ఉగ్రదాడిలో కర్నల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడు ఘటనలో మృతి చెందారు.
అలాగే మరో నలుగురు అస్సాం రైఫిల్స్‌కు చెందిన జవాన్లు సైతం ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయాలపాలవగా.. వారిని బెహియాంగ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు తెలుస్తున్నది. ఘటనను మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ధ్రువీకరించారు. ఘటనను తీవ్రంగా ఖండించారు. సమాచారం అందుకున్న బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
మణిపూర్‌కు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి పాల్పడినట్లు ఆర్మీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాద దాడిని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఖండించారు. దాడిని పిరికిపందల చర్యగా పేర్కొన్నారు. సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్న ఆయన.. అమరులైన వారికి నివాళులర్పించారు. ఘటనకు బాధ్యులైన వారిని వదిలేది లేదని హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

