డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో (Dehradun) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడి పండ్ల లోడుతో (Mango Truck) వెళ్తున్న ఓ లారీ డెహ్రాడూన్‌లోని రిస్పాన్ బ్రిడ్జిపై అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో లారీలో ఉన్న మామిడి పండ్లు మొత్తం రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అది చూసిన జనం చిన్నా పెద్ద అని తేడా లేకుండా మామిడి పండ్ల కోసం ఎగబడ్డారు. పాదచారులతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇండ్లలో ఉన్నవారు కూడా బస్తాలు, సంచులతో ఘటనా స్థలానికి వచ్చి మామిడి పండ్లను దొరికినవారికి దొరికినన్ని ఎత్తుకెళ్లారు.
మరికొందరైతే ఏకంగా క్రేట్లనే తీసుకెళ్లిపోయారు. పెద్ద సంఖ్యలో జనం ఆ ప్రాంతంలో గుమికూడటంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఉచితంగా దొరికేవాటి కోసం జనం ఎగబడితే మన దేశం ఎప్పటికి అభివృద్ధి చెందుతుందంటూ సెటైర్లు వేశారు. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవషాత్తు ఎవరూ గాయపలేదని పోలీసులు తెలిపారు.
देहरादून के रिस्पना पुल पर एक आम से लदा ट्रक पलट गया। हादसे में किसी को चोट नहीं आई, मगर सड़क पर बिखरे रसीले आमों ने कुछ लोगों की आँखें चमका दीं। आपदा को अवसर बनाते हुए, कई लोग टोकरी-थैले लेकर आम लूटने में जुट गए, मानो मुफ्त का मेला लग गया हो! pic.twitter.com/NTqz8n4DpR
— bhUpi Panwar (@askbhupi) July 16, 2025