Tanushka Singh | న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో (ఐఏఎఫ్) ‘జాగ్వార్ ఫైటర్ జెట్’లో చేరటమంటే మామూలు విషయం కాదు. వ్యూహాత్మక, కచ్చితమైన వైమానిక దాడులకు ఆ విభాగం పేరొందింది. శాశ్వత నియామకంతో దీంట్లో చేరిన మొదటి మహిళా పైలట్‌గా తనుష్క సింగ్ గుర్తింపు అందుకున్నారు.
జాగ్వార్ ఫైటర్ దళానికి పూర్తిస్థాయిలో ఎంపికైన తొలి మహిళా పైలట్‌గా ఆమె రికార్డ్ సృష్టించారు. తెలంగాణ, దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందారు. హాక్ ఎంకే 132 ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడపటంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.