Delhi Metro : దేశ ప్రజల్లో రోజురోజుకీ సివిక్ సెన్స్ ( పౌర స్పృహ) తగ్గిపోతోంది అని చెప్పేందుకు తాజా ఘటన ఒక నిదర్శనం. ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్ లో ఒక వ్యక్తి బహిరంగ మూత్ర విసర్జన చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మూత్రం పోసిన అతడిపై విమర్శలు చేస్తున్నారు. దేశంలో సివిక్ సెన్స్ లోపించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా ఘటనకు సంబంధించిన వీడియో ప్రకారం.. ఢిల్లీ మెట్రో స్టేషన్, పింక్ లైన్ వద్ద రాత్రిపూట, బహిరంగ ప్రదేశంలో ఒక వ్యక్తి మూత్రం పోశాడు. అక్కడున్న ఒక వ్యక్తి దీన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో తీయడాన్ని గమనించగానే అతడు అక్కడినుంచి వెళ్లిపోయాడు. కానీ, ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. రోజూ వేలాది మంది ప్రయాణికులు తిరిగే చోట ఇలా బుద్ధి లేకుండా మూత్ర విసర్జన చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఎంతో గొప్ప పేరున్న ఢిల్లీ లాంటి మహా నగరంలో ఇలా చేయడం వల్ల సిటీ ఇమేజ్ దెబ్బతింటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రతిష్టాత్మక మెట్రో స్టేషన్లలో కనీస భద్రత, పర్యవేక్షణ కూడా లేకపోయిందని, అందువల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రజలు అంటున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని, చాలా మంది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
Civic sense is seriously lacking among many people in Delhi.
-> In metro premises, some openly urinate or even let children do the same.
-> Used metro tickets are thrown on the floor instead of dustbins.
-> People eat at stations and leave the waste right there.
Overall,… pic.twitter.com/BhbjSlZpdK
— Shubham 🌠 (@jai_shree_radhe) January 19, 2026
ఇలా పెద్దలు, పిల్లలు మూత్రం పోయడంతోపాటు, ఉమ్మివేయడం, టిక్కెట్లు, ఆహార పదార్థాల్ని డస్ట్ బిన్ లో కాకుండా నేలపైనే పడేయడం వంటి బాధ్యతారాహిత్యమైన పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ స్పందించింది. ఇలాంటి పనులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ ఫైన్లు వేస్తామని హెచ్చరించింది. పర్యవేక్షణ సిబ్బందిని పెంచుతామని చెప్పింది. అలాగే ప్రజలు కూడా బాధ్యతగా నడుచుకోవాలని సూచించింది.