ఈ భూమ్మీద నూకలు ఉన్నంత కాలం ఎవ్వరినీ ఏం చేయలేం అంటారు పెద్దలు. అవును.. ఒక వ్యక్తికి ఆయుష్షు మూడితేనే చావు వస్తుంది తప్పితే. తను చావాలనుకుంటే రాదు. తనకు చావు కావాలనుకున్నప్పుడు రాదు. చావు వచ్చినప్పుడు దాన్ని మనం స్వీకరించాల్సి ఉంటుంది. అంతే తప్పా.. చావు విషయంలో సొంతంగా నిర్ణయాలు తీసుకోకూడదని ఈ ఘటన నిరూపించింది.
ముంబైలోని శివ్డి లోకల్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. శివ్డి స్టేషన్‌కు లోకల్ ట్రెయిన్ వస్తుంది. అదే సమయంలో ప్లాట్‌ఫామ్‌కు కొంత దూరంలోనే ఓ వ్యక్తి సడెన్‌గా వెళ్లి ట్రాక్ మీద పడుకున్నాడు. అదే సమయంలో ట్రెయిన్ దూసుకొస్తోంది. అయితే.. ఆ వ్యక్తి ట్రాక్ మీద పడుకోవడం.. ట్రెయిన్‌ను నడిపే మోటర్మ్యాన్ చూశాడు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్స్ అప్లయి చేసి రైలును ఆపాడు. దీంతో ట్రెయిన్ ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆగిపోయింది. దీంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. వెంటనే అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు అతడి వివరాలు కనుక్కొని తన ఫ్యామిలీ మెంబర్స్‌కు అప్పగించారు.
ఈ ఘటన రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. దీంతో ఆ వీడియోను రైల్వే మినిస్ట్రీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
मोटरमैन द्वारा किया गया सराहनीय कार्य : मुंबई के शिवड़ी स्टेशन पर मोटरमैन ने देखा कि एक व्यक्ति ट्रैक पर लेटा है उन्होंने तत्परता एवं सूझबूझ से इमरजेंसी ब्रेक लगाकर व्यक्ति की जान बचाई।
— Ministry of Railways (@RailMinIndia) January 2, 2022
आपकी जान कीमती है, घर पर कोई आपका इंतजार कर रहा है। pic.twitter.com/OcgE6masLl
సకాలంలో స్పందించి.. రైలుకు ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడిన మోటర్ మ్యాన్‌ను ప్రశంసించింది రైల్వే మినిస్ట్రీ. మీ జీవితం చాలా విలువైనది. చిన్న చిన్న సమస్యలతో జీవితాన్ని నాశనం చేసుకోకండి. మీ కోసం మీ ఫ్యామిలీ ఉంది.. అంటూ మినిస్ట్రీ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్, వీడియోపై స్పందించిన నెటిజన్లు.. మోటర్మ్యాన్ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
సూపర్బ్.. ఒక్క క్షణం ఆలస్యంగా బ్రేక్ వేసినా.. ఆ వ్యక్తి ప్రాణాలు పోయేవి. మెరువు వేగంతో స్పందించి.. బ్రేకులు వేసి ప్రాణాలు కాపాడిన నువ్వు దేవుడితో సమానం.. అంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.
My Salute to the Great Motorman for saving the life of a whole family by saving this person life because they all must be depending on him, he must in frustration but when he crosses that critical time he will feel sorry, my Salute to the female officials in uniform fast action
— Indian (@Anil50305597) January 2, 2022
The driver needs to be thanked.
— CA. Allama Prabhu M.S. (@AllamaPrabhuCA) January 2, 2022
Anyway, it reflects the philosophy of the Railways to give importance to LIFE rather than RULES.
Hats off to you all
May God bless The motorman and RPF staffs for their prompt action to save him.
— Roshan (@universal17om) January 2, 2022
Well done Motorman🙏🙏
— Bharat chaudhari (@BharatnIndia) January 2, 2022