Man Attacks Doctor With Sickle | డాక్టర్‌పై కొడవలితో దాడి చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Man Attacks Doctor With Sickle | ఆసుపత్రిలోని డాక్టర్‌పై ఒక వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. 18 సార్లు వేటు వేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ డాక్టర్ పరిస్థితి విషమంగా ఉంది.
ముంబై: ఆసుపత్రిలోని డాక్టర్‌పై ఒక వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. 18 సార్లు వేటు వేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ డాక్టర్ పరిస్థితి విషమంగా ఉంది. (Man Attacks Doctor With Sickle) మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి పంచవటి ప్రాంతంలోని ప్రైవేట్ ఆసుపత్రిలోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఆసుపత్రి డైరెక్టర్ అయిన 48 ఏళ్ల డాక్టర్ కైలాస్ రాఠి గదిలోకి వెళ్లాడు. చేతిలోని కొడవలితో 18 సార్లు దాడి చేశాడు. ఆ వ్యక్తి రాకను గమనించని ఆ డాక్టర్ ఈ దాడిలో తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. డాక్టర్ కైలాస్‌పై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ ఆసుపత్రిలో పని చేసి మానేసిన మహిళ భర్తగా నిందితుడ్ని గుర్తించారు. ఆసుపత్రిలో పని చేసిన అతడి భార్య రూ.6 లక్షలు కాజేసింది. దీంతో ఆమెను పని నుంచి తొలగించారు. తిరిగి పనిలో చేరిన ఆమె రూ.12 లక్షలు వాడుకున్నది. వాటిని చెల్లించకపోవడంతో డాక్టర్ భార్య ఫిర్యాదు చేసింది. దీంతో ఆ మహిళతోపాటు ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఆగ్రహించిన ఆ వ్యక్తి కొడవలితో డాక్టర్ కైలాస్‌పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- attacks
- Doctor
- Hospital
- Maharashtra
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

