తమ పేరిట రికార్డులు సెట్ చేసేందుకు కొందరు ఎంతవరకైనా వెళుతుంటారు. కొద్దివారాల కిందట తన తలపై వందల గ్లాస్‌లను ఓ వ్యక్తి బ్యాలెన్స్ చేసిన వీడియో వైరల్ (Viral Video) కాగా లేటెస్ట్గా మరో వైరల్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ తరహా మరో వీడియోను ఇటీవల గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసింది.
ఈ వీడియోలో ఓ వ్యక్తి తన పొట్టపై పలు భారీ పుచ్చకాయలను ఉంచి వాటిని తన కుడి చేతిలో ఉన్న కత్తితో కట్ చేయడం చూడొచ్చు. 2018లో ఈ అరుదైన ఫీట్‌ను ప్రదర్శించిన సదరు వ్యక్తి రికార్డు సృష్టించాడు. ఇక ఈ ప్రమాదకర విన్యాసానికి సంబంధించిన వీడియోను గిన్నీఊస్ రికార్డ్స్ కొద్దిరోజుల కిందట విడుదల చేసింది.
ఈ ఘటనకు సంబంధించిన ఇన్స్టాగ్రాం రీల్‌కు ఇప్పటివరకూ ఏకంగా 17 లక్షల వ్యూస్ లభించాయి. అతడి సాహసాన్ని పలువురు నెటిజన్లు కొనియాడగా, మరికొందరు రికార్డు కోసం ఈ రిస్కీ ఫీట్ అవసరమా అని కామెంట్ చేశారు.
Read More