న్యూఢిల్లీ : పొలాలు, చెట్ల కింద ప్రశాంతంగా కునుకు తీసేవారికి హెచ్చరిక వంటి ఓ వీడియో (Viral Video) సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ షాకింగ్ వీడియోలో మృత్యుకోరల నుంచి ఓ వ్యక్తి త్రుటితో తప్పించుకోవడం కనిపిస్తుంది. వైరల్ క్లిప్‌లో ఓ వ్యక్తి షర్ట్‌లో దూరిన నాగుపాము షర్ట్ బటన్స్ గుండా మెల్లిగా బయటకు వెళ్లడంతో అక్కడున్న వారంతా ఊపిరిపీల్చుకోవడం చూడొచ్చు.
గుర్తుతెలియని ప్రాంతంలో రికార్డైన ఈ షాకింగ్ వీడియోలో ఓ వ్యక్తి షర్ట్‌లో ఉన్న కోబ్రాను బయటకు తీసేందుకు కొందరు ప్రయత్నించడం కనిపిస్తుంది. పొలంలో సేదతీరుతుండగా వ్యక్తి షర్ట్లోకి పాము దూరడం కలకలం రేపింది.
షర్ట్ లోపలి నుంచి పాము బయటకు వెళ్లడంతో ఆ వ్యక్తి ఎలాంటి గాయాలు లేకుండా బయటపడటంతో వీడియో ముగుస్తుంది. ఆ ప్రాంతం నుంచి నాగుపాము వెళ్లడం చూడొచ్చు. పంట పొలాల్లో నిద్రించే వారికి ఈ వీడియో వార్నింగ్ వంటిదని నెటిజన్లు పేర్కొంటున్నారు.
Read More :