న్యూఢిల్లీ : ముంబై లోకల్ ట్రైన్లో ఇద్దరు ప్రయాణీకులు దురుసుగా ప్రవర్తించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో తన స్నేహితుడి పక్కన కూర్చున్న మహిళ తనకు ఎదురుగా ఉన్న సీటుపై కాలు పెట్టడం కనిపిస్తుంది. ఎదురు సీటులో కూర్చున్న ప్రశాంత్ ఆమెను కాలు తీయాలని కోరగా సదరు మహిళ, ఆమె స్నేహితుడు ప్రశాంత్‌తో వాదించడం ఈ క్లిప్‌లో కనిపిస్తుంది.
@MumbaiPolice @Central_Railway @CPMumbaiPolice these people supposed to be lawyers and sitting in the train like this pic.twitter.com/W3dYwtGnSr
— prashantwaydande (@prashantwaydan3) February 1, 2023
వీరి అభ్యంతరకర ప్రవర్తనతో కూడిన వీడియోను ఫొటో జర్నలిస్ట్ ప్రసాద్ ట్విట్టర్లో షేర్ చేయడంతో పాటు ముంబై పోలీసులు, రైల్వే అధికారులను ట్యాగ్ చేశారు.తాను కూర్చున్న సీటుపై కాలు తీయాలని మహిళ, ఆమె స్నేహితుడిని ప్రసాద్ పలుమార్లు కోరడం వీడియోలో కనిపిస్తుంది. ప్రసాద్‌తో వాదనకు దిగిన మహిళ ఈ ఘటనను వీడియో తీయవద్దని తాము న్యాయవాదులమని దబాయిస్తుంది.
వీరు న్యాయవాదులమని చెబుతూ ట్రైన్లో ఇలా కూర్చున్నారని వీడియోను షేర్ చేస్తూ ప్రసాద్ రాసుకొచ్చారు. ఈ ఘటనపై స్పందించిన ముంబై పోలీసులు కామెంట్స్ సెక్షన్లో ముంబై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ట్యాగ్ చేశారు. సీటు ఖాళీగా ఉన్నా మరో సీటుపై ప్రయాణీకులు కాలు మోపడం సరైన పద్ధతి కాదని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఈ మహిళను అసలు విడిచిపెట్టొద్దు..వీరిని నెలరోజుల పాటు ప్రయాణం చేయకుండా నిషేధించాలని మరో యూజర్ రాసుకొచ్చారు. సహ ప్రయాణీకుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం సరికాదని మరొక యూజర్ మండిపడ్డారు.