న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని కొత్త పార్లమెంటు ఎదుట ఓ వ్యక్తి బుధవారం ఆత్మాహుతి యత్నం చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర ప్రదేశ్లోని బాగ్పట్కు చెందిన జితేంద్ర పార్లమెంటు ఎదుట ఉన్న పార్క్లో పెట్రోల్ వంటి పదార్థాన్ని ఒంటిపై పోసుకుని ఆత్మాహుతి యత్నం చేశారు. మంటల్లో కాలుతూనే పార్లమెంటు మెయిన్ గేట్ వైపు వెళ్లాడు. 90 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆయనను ఓ దవాఖానలో చేర్పించారు. ఆయన వద్ద ఓ డైరీ, రెండు పేజీల సూసైడ్ నోట్ దొరికింది. ఒకరితో వ్యక్తిగత శత్రుత్వం కారణంగానే అతడు ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నది.