లక్నో: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మరో అవినీతి బయటపడింది. కొత్తగా వేసిన తారు రోడ్డును ఒక వ్యక్తి ఒట్టి చేతులతో తొలగించాడు. ఆ రోడ్డు నాణ్యతను అతడు ప్రశ్నించాడు. నాసిరకంగా రోడ్డు నిర్మించిన సంబంధిత కాంట్రాక్టర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. యూపీలోని డియోరియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక గ్రామంలో కొత్తగా వేసిన తారు రోడ్డు అంచు భాగాన్ని ఒక వ్యక్తి తన చేతులతో పెకళించాడు. రోడ్డు నిర్మాణం నాసిరకంగా ఉందని ఆరోపించాడు. కాంట్రాక్టర్ డబ్బులు ఆదా చేసేందుకు పాత రోడ్డుపై ఉన్న మట్టిని శుభ్రం చేయించలేదని విమర్శించాడు. దీని వల్ల కొత్తగా వేసిన రోడ్డు నాణ్యత దెబ్బతిన్నదని ఆ వ్యక్తి ఆరోపించాడు.
కాగా, అహ్మద్ ఖబీర్ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. నాణ్యతలేని రోడ్డు నిర్మాణంతో ప్రభుత్వ అవినీతి బయటపడిందని కొందరు ఆరోపించారు. సంబంధిత కాంట్రాక్టర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేశారు.
Watch: Massive corruption in road construction in Uttar Pradesh exposed, A man in Deoria scoops out newly-laid road by hand showing that extremely poor quality materials were used in construction. pic.twitter.com/QcoFggrN4L
— Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) December 7, 2022