మనం పామును చూస్తేనే ఆమడదూరం పారిపోతాం. పాము బుసకొడితే అక్కడినుంచి వేగంగా పరుగెడుతాం. కాగా, ఫిష్నెట్లో చిక్కుకున్న కింగ్ కోబ్రాను ఓ వ్యక్తి భయపడకుండా రక్షించాడు. ఫిష్నెట్ను కత్తెరతో కత్తిరించి కింగ్ కోబ్రాను కాపాడాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోను మిర్జా ఎండీ ఆరిఫ్ అనే యూ ట్యూబ్ చానల్లో అప్లోడ్ చేశారు. ఈ వీడియోను ఒడిశాలో షూట్ చేశారు. ఫిష్నెట్లో చిక్కుకున్న కింగ్ కోబ్రా దగ్గరికి ఓ వ్యక్తి వస్తాడు. ఫిష్ నెట్‌ను కత్తెరతో కట్ చేస్తాడు. దాహంతో ఉన్న కోబ్రాకు వాటర్ బాటిల్‌తో నీళ్లు తాగిస్తాడు. చివరగా, కోబ్రాను రక్షించి సురక్షిత ప్రాంతంలో వదిలిపెడతాడు. ఈ వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంది. అందరూ ఆ వ్యక్తిని ప్రశంసించారు.