పుష్ప క్రేజ్ మామూలుగా లేదు. భాషాభేదం లేకుండా అన్ని రాష్ట్రాల్లో పుష్ప సినిమా గురించి చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాలోని పాటలు అయితే జనాలకు తెగ నచ్చేశాయి. దీంతో ఆ పాటలకు డ్యాన్స్ వేస్తూ అదరగొట్టేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కూడా శ్రీవల్లి పాటలోని హూక్ స్టెప్‌ను వేసి వీడియోను షేర్ చేశారు. తాజాగా టిక్ టాక్ స్టార్ షాదాబ్ అలీ ఖాన్ తన బేబీని నిద్రపుచ్చేందుకు శ్రీవల్లి సాంగ్ హూక్ స్టెప్ వేశాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. వావ్ బేబీని బాగానే నిద్రపుచ్చావు. బేబీని పట్టుకొని భలేగా హూక్ స్టెప్ వేశావు బ్రదర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.