Man Opens Fire Indiscriminately | విచక్షణారహితంగా కాల్పులు జరిపిన వ్యక్తి.. పోలీస్ మృతి, మరో వ్యక్తికి గాయాలు
Man Opens Fire Indiscriminately | ఒక వ్యక్తి విచక్షణారహితంగా గన్‌తో కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గాయపడి ఒక పోలీస్ అధికారి మరణించాడు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనంతరం అతడు తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి విచక్షణారహితంగా గన్‌తో కాల్పులు జరిపాడు. (Man Opens Fire Indiscriminately) కాల్పుల్లో గాయపడి ఒక పోలీస్ అధికారి మరణించాడు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనంతరం అతడు తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. సోమవారం రాత్రి 11.45 గంటలకు నందనగరి ప్రాంతంలోని వంతెన వద్ద ఒక వ్యక్తి అలజడి సృష్టించాడు. రోడ్డుపై వెళ్లే వాహనదారులపై విచక్షణారహితంగా పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై తొలుత కాల్పులు జరుపగా అతడు తప్పించుకున్నాడు. ఆ వెనకే బైక్‌పై వెళ్తున్న ఏఎస్ఐ దినేష్ శర్మ శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. స్కూటర్‌పై వెళ్తున్న 30 ఏళ్ల అమిత్‌పై కూడా ఆ వ్యక్తి కాల్పులు జరిపాడు.
కాగా, ఆ వ్యక్తి ఆ తర్వాత ఒక ఆటో వెనుక సీటులో కూర్చొన్నాడు. ఆటో నడపాలని డ్రైవర్‌కు చెప్పగా అతడు నిరాకరించాడు. దీంతో ఆటో డ్రైవర్‌పై కూడా కాల్పులు జరుపగా అతడు తప్పించుకుని పారిపోయాడు. అనంతరం ఆ వ్యక్తి తన తలపై గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆటో వెనుక సీటులో కుప్పకూలి మరణించాడు.
మరోవైపు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన పోలీస్ అధికారి దినేష్ శర్మను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే నడుం వద్ద గాయమైన అమిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి, ఆపై కాల్చుకుని సూసైడ్ చేసుకున్న వ్యక్తిని నంద్ నగరి మురికివాడకు చెందిన 44 ఏళ్ల ముఖేష్‌గా పోలీసులు గుర్తించారు. ఈ కాల్పుల సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
दिल्ली के नंद नगरी इलाके में एक शख्श ने ASI को मारी गोली, फिर खुद को गोली मारकर की आत्महत्या….. #DelhiPolice #ASI #nandnagri #nedreicknews@DelhiPolice@DelhiPoliceCom1 pic.twitter.com/gbkI4238wE
— Nedrick News (@nedricknews) April 16, 2024
https://twitter.com/sagarmalik1985/status/1780179992103862425?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1780179992103862425%7Ctwgr%5E6bdb3ced3f2060238edb5645187a6cdd715e1bc4%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.freepressjournal.in%2Findia%2Fdelhi-shocker-man-opens-fire-indiscriminately-killing-cop-injuring-another-youth-later-shoots-himself
दिल्ली: नंद नगरी में मीत नगर फ्लाईओवर के पास दो लोगों को गोली मार दी गई, जिनमें से एक की मौत हो गई, जबकि दूसरे का इलाज चल रहा है। बाद में शूटर ने खुद को मार डाला.
नॉर्थ ईस्ट के डीसीपी जॉय टिर्की ने कहा, "आज सुबह करीब 11.42 बजे, पीएस नंद नगरी को एक कॉल की गई जिसके बाद कॉल को पीएस… pic.twitter.com/WVhlWYGllE
— Report1 Bharat (@Report1Bharat) April 16, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

