చండీగఢ్: పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో హత్యాయత్నం జరిగింది. వీల్ చైర్లో ఉండి శిక్షలో భాగంగా సేవాదార్ (కాపలాదారుడు)గా సేవలో ఉన్న ఆయనపై బుధవారం ఖలిస్థాన్ మాజీ ఉగ్రవాది కాల్పులు జరిపాడు.
అయితే అక్కడ సాధారణ దుస్తుల్లో ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని అడ్డుకోవడంతో బుల్లెట్ గురితప్పి పక్కనే ఉన్న గోడకు తగిలింది. వెంటనే నిందితుడి నుంచి మారణాయుధాన్ని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. కాల్పుల అనంతరం సుఖ్బీర్ తన శిక్షను కొనసాగించారు.