లక్నో: మార్నింగ్ వాక్ చేస్తున్న ఒక వ్యక్తిని వీధి కుక్కలు (stray dogs) చుట్టుముట్టాయి. ఆయనను కరిచి, రక్కి చంపాయి. ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. 65 ఏళ్ల సఫ్దర్ అలీ స్థానిక సివిల్ లైన్స్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌లోని సర్ సయ్యద్ మ్యూజియం వద్ద ఉన్న గార్డెన్లో మార్నింగ్ వాక్ చేస్తున్నారు. ఇంతలో సుమారు ఏడెనిమిది కుక్కలు అక్కడకు వచ్చాయి. మార్నింగ్ వాక్ చేస్తున్న అలీపై దాడి చేశాయి. ఆయనను దారుణంగా కరిచి చంపాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆ వృద్ధుడ్ని ఎవరూ కాపాడలేకపోయారు.
కాగా, ఉదయం 7.30 గంటలకు స్థానికుల నుంచి ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుక్కల దాడిలో మరణించిన సఫ్దర్ అలీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు మార్నింగ్ వాక్ చేస్తున్న వృద్ధుడిపై కుక్కలు దాడి చేసి దారుణంగా చంపిన ఈ సంఘటనపై అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ స్పందించలేదు. కాగా, ఆ గార్డెన్ వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. వీధి కుక్కల దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
In the CCTV footage shared on social media, a man could be seen attacked by at least 7-8 dogs before he succumbed to his injuries
Details: https://t.co/Ag7oJR8qRe pic.twitter.com/wqphaGovzu
— HT Lucknow (@htlucknow) April 16, 2023
प्रकरण के संबंध में पुलिस अधीक्षक नगर की बाइट pic.twitter.com/CisQiXHxMl
— ALIGARH POLICE (@aligarhpolice) April 16, 2023