Crime news : ఒక వ్యక్తిని ఏడుగురు వేట కత్తులతో వెంటాడి దారుణంగా హత్య (Murder) చేశారు. కర్ణాటక రాష్ట్రం (Karnataka state) లోని కొప్పాల్ జిల్లా (Koppal district) లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలే (Property disputes) ఈ హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఏడుగురు వ్యక్తులు తనను వేట కత్తులతో వెంటాడుతుంటే చెన్నప్ప నారినాల్ అనే వ్యక్తి తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం రోడ్డుపై పరుగులు తీశాడు. ఆఖరి రోడ్డ పక్కన ఓ బేకరీలో వెళ్లి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశాడు. కానీ ప్రత్యర్థులు అతడిని విడిపెట్టలేదు. బేకరీలోనే కత్తులతో, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు.
తీవ్ర గాయాలతోనే బేకరీ నుంచి బయటపడి పరుగులు తీస్తున్న చెన్నప్పను ఆ ఏడుగురిలోని ముగ్గురు వ్యక్తులు వెంటాడి పొడిచి చంపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు పాల్పడిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ హత్యతో సంబంధం ఉన్న మిగతా వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు.
Law and order of Congress ruled Karnataka is as weak as the internal stability of Congress.
An individual named Chenappa Narinal was chased and brutally attacked inside a bakery.
CCTV shows him running in circles trying to escape, but was eventually stabbed to death outside the… pic.twitter.com/YIZKItvfhZ
— Cons of Congress (@ConsOfCongress) June 2, 2025