కిరణ్‌పూర్: మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా చంపేశాడు. స్నానం చేశాక టవల్ అడిగితే ఇవ్వలేదని భార్యను షావల్తో కొట్టి చంపాడు. ఈ ఘటన బాలాఘాట్ జిల్లాలోని కిరణ్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడు రాజ్‌కుమార్ బాహే అటవీశాఖలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. అయితే డ్యూటీ ముగిశాక ఇంటికి వచ్చిన అతను స్నానం చేసి తన భార్య పుష్పా భాయ్‌ని కొట్టాడు. గిన్నెలు శుభ్రం చేస్తున్న ఆమె.. కాసేపు అయ్యాక టవల్ ఇస్తానని చెప్పింది. కానీ లోపు ఆవేశానికి గురైన భర్త రాజ్‌కుమార్.. భార్యను ఓ షావెల్తో చితకబాదాడు. తండ్రిని అడ్డుకోబోయిన కూతుర్ని బెదిరించాడు. పోస్టుమార్టమ్ నిర్వహించిన పోలీసులు పుష్పా భాయ్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.