బాలఘాట్: తుడుచుకోవడానికి టవల్ అడిగితే ఇవ్వలేదని భార్యను భర్త కొట్టిచంపాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లోని బాలఘాట్ జిల్లా హిరాపూర్‌లో చోటుచేసుకున్నది. హిరాపూర్కు చెందిన రాజ్‌కుమార్ బహె అటవీశాఖలో పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం స్నానంచేసిన రాజ్‌కుమార్.. తుడుచుకోవడానికి టవల్ ఇవ్వాలని భార్య పుష్పాబాయి (40)ని అడిగాడు. పాత్రలు కడుతున్నానని కొద్దిసేపు ఆగమని కోరింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త పెద్దగరిటెతో భార్య తలపై పదేపదే కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఇంట్లోంచి పరారైన నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.