మలప్పురం: కేరళలోని మలప్పురంలో ఈ నెల 9న మరణించిన 24 ఏళ్ల యువకునికి నిఫా వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఈ వ్యక్తి మరణానంతరం ప్రాంతీయ వైద్యాధికారి నిర్వహించిన దర్యాప్తులో నిఫా వైరస్ గురించి అనుమానం వచ్చిందన్నారు. వెంటనే నమూనాలను పరీక్షల కోసం పంపించామని చెప్పారు.
కొజికోడ్‌లో నిర్వహించిన పరీక్షల్లో నిఫా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయిందని వివరించారు. పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కూడా ఇది నిఫా వైరస్ ఇన్ఫెక్షన్ అని ఆదివారం ధ్రువీకరించింది. మృతుని స్వస్థలం మలప్పురం. ఆయన స్నేహితులతో కలిసి బెంగళూరులో కొన్ని రోజులు గడిపారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రాణాలు కోల్పోయారు.
న్యూయార్క్, సెప్టెంబర్ 15: హార్మోన్ చికిత్సతో ఇన్సులిన్ నిరోధకతను గణనీయంగా తగ్గించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. రుతు క్రమం ఆగిన(మెనోపాజ్) మహిళల్లో ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గిపోవడం వల్ల వారు ఇన్సులిన్ నిరోధకత సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు.
అమెరికాలోని డ్రెక్సెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్, రీడింగ్ హాస్పిటల్ టవర్ హెల్త్ పరిశోధకుడు డాక్టర్ జియాంగ్ మాట్లాడుతూ కొత్త మెటా పద్ధతిలో చేసిన ఈ అధ్యయనంలో ఆరోగ్యవంతులైన మెనోపాజ్ మహిళల్లో ఇన్సులిన్ నిరోధకత గణనీయంగా తగ్గిందని తెలిపారు.