సోలన్: హిమాచల్‌ప్రదేశ్‌లో మంకీపాక్స్ (monkeypox) కలకలం సృష్టిస్తున్నది. సోలన్ జిల్లాలో మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదయింది. బద్ది ప్రాంతానికి చెదిన ఓ వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలతో బాధపడుతున్నాడని అధికారులు తెలిపారు. దీంతో అతని నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించామని వెల్లడించారు. 21 రోజుల క్రితమే అతనికి ఇన్ఫెక్షన్ వచ్చిందని, ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని చెప్పారు. అతనికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదన్నారు.
ప్రస్తుతం అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడని తెలిపారు. ఆ ప్రాంతంలో వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు ప్రాథామిక చర్యలు తీసుకున్నామని, అక్కడ పరిస్థితిని క్షుణ్ణంగా పరీశీలిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, దేశంలో ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇందులో కేరళలో మూడు, ఢిల్లీలో ఒకటి చొప్పున ఉన్నాయి.