ChatGPT | చాట్‌జీపీటీ వాడకంపై శిక్షణతో 3 నెలల్లోనే రూ. 28 లక్షలు ఆర్జించాడు
ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ (ChatGPT) వాడకంపై శిక్షణ ఇస్తూ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మూడు నెలల్లోనే ఏకంగా రూ. 28 లక్షల విలువైన భారత కరెన్సీని ఆర్జించాడు.
న్యూయార్క్ : ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ (ChatGPT) వాడకంపై శిక్షణ ఇస్తూ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మూడు నెలల్లోనే ఏకంగా రూ. 28 లక్షల విలువైన భారత కరెన్సీని ఆర్జించాడు. డిసెంబర్ 2022లో ఓ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫాం వేదికగా ఆయన ఆన్లైన్ కోర్సును లాంఛ్ చేశాడు. 20 నుంచి 50 ఏండ్ల వయసు వారు ఈ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అయ్యారు.
చాట్‌జీపీటీని ఎలా ఉపయోగించాలనే దానిపై తాను ఈ కోర్సు లాంఛ్ చేశానని ల్యాన్స్ జంక్ వెల్లడించారు. మూడు నెలల్లో జంక్ చేపట్టిన చాట్‌జీపీటీ మాస్టర్‌క్లాస్ : ఏ కంప్లీట్ గైడ్ ఫర్ బిగినర్స్ అనే కోర్సుకు విద్యార్ధుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 15,000కు ఎగబాకింది. జంక్ తన సేల్స్ డ్యాష్‌బోర్డ్ స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేశాడు. 2022 నవంబర్ నుంచి చాట్‌జీపీటీని ఉపయోగించుకోవడం జంక్ మొదలుపెట్టాడు.
ఇందులో ఉన్న అద్భుత జనరేటివ్ సామర్ధ్యాలకు ముగ్ధుడైన జంక్ ఈ కూల్ ఏఐ టూల్‌ను యూజర్లు సమర్ధవంతంగా వాడుకునేలా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. చాట్‌జీపీటీ అంటే ప్రజల్లో ఓ భయం ఉందని, దాన్ని తాను ఎగ్జైటింగ్‌గా, అప్రోచబుల్‌గా మలిచేందుకు తాను ప్రయత్నించానని అన్నారు. ఈ ఆన్లైన్ కోర్స్‌లో చాట్‌జీపీటీ బేసిక్స్‌తో పాటు బిజినెస్‌లు, విద్యార్ధులు, ప్రోగ్రామర్లకు అవసరమైన చాట్‌జీపీటీ నిర్ధిష్ట అప్లికేషన్స్‌పై లెసన్స్ ఉంటాయి.
Read More
ChatGPT | చాట్‌జీపీటీతో వర్క్ కల్చర్‌లో సమూల మార్పులు..వారానికి నాలుగు రోజుల పని : ప్రముఖ ఆర్ధిక వేత్త
ChatGPT | పలు దేశాల్లో చాట్‌జీపీటీపై నిషేధం : ఏఐ టూల్‌కు ఎందుకు చెక్ పెడుతున్నారు..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

