Viral Video: ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో.. దర్జాగా కారుపైన కూర్చొని మద్యం సేవించిన వ్యక్తి
కారు లోపల ఉన్న వ్యక్తి ఖాళీ గ్లాస్‌ను అతడికి అందించాడు. దీంతో కారు పైన కూర్చొన్న వ్యక్తి ఆ గ్లాస్ అందుకున్నాడు. తన వద్ద ఉన్న బాటిల్లోని మద్యాన్ని ఆ గ్లాస్‌లోకి పోసుకుని తాగాడు.
చండీగఢ్: ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో ఒక వ్యక్తి దర్జాగా కారుపైన కూర్చొని మద్యం సేవించాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. ట్రాఫిక్ జామ్ వల్ల వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. అయితే ఒక వ్యక్తి కారు పైకి ఎక్కి టాప్‌పై కూర్చొన్నాడు. అతడి చేతిలో మద్యం బాటిల్ ఉంది. కారు లోపల ఉన్న వ్యక్తి ఖాళీ గ్లాస్‌ను అతడికి అందించాడు. దీంతో కారు పైన కూర్చొన్న వ్యక్తి ఆ గ్లాస్ అందుకున్నాడు. తన వద్ద ఉన్న బాటిల్లోని మద్యాన్ని ఆ గ్లాస్‌లోకి పోసుకుని తాగాడు. ఆ సమయంలో ఒక వాహనంలో వెళ్తున్న వ్యక్తి తన మొబైల్ ఫోన్లో దీనిని రికార్డు చేశాడు. రవి హండా అనే యూజర్ ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘గుర్గావ్లో మాత్రమే ఇలా జరుగుతుంది’ అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కారుపైన కూర్చొని మద్యం సేవించిన వ్యక్తిపై నెటిజన్లు మండిపడ్డారు. పోలీసులు పట్టుకుని కొడితే అతడి మత్తు దిగుతుందని ఒకరు విమర్శించారు. ఆ వ్యక్తి త్వరలో జైలుకెళ్తాడని మరొకరు పేర్కొన్నారు.
మరోవైపు ముగ్గురు వ్యక్తులు కదులుతున్న కారు విండో నుంచి బయటకు వంగి ప్రమాదకరంగా స్టంట్లు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివార్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని యూపీ పోలీసులను కోరారు. దీంతో మీరట్ పోలీసులు స్పందించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
This can only happen in Gurgaon. 😂 pic.twitter.com/SMLBDB0bjl
— Ravi Handa (@ravihanda) January 7, 2023
ये कौनसे शूरवीर हैं जो पुलिस स्टीकर वाली गाड़ी से लटककर पुलिस साईरन-लाल बत्ती जलाकर हाईवे पर जनता की सुरक्षा कर रहे हैं ? @Uppolice pic.twitter.com/n4GLPSOKK9
— Swati Maliwal (@SwatiJaiHind) January 9, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

