Heart Attack | యువతలో ఎందుకిలా..! : గుండెపోటు మరణాలపై ఆందోళన
యువతలో గుండె పోటు (Heart Attack) మరణాలు ఇటీవల పెరుగుతున్నాయి. హార్ట్ ఎటాక్‌తో ఎందరో యువకులు కుప్పకూలిన వీడియోలు సోషల్‌మీడియాలో వెలుగుచూస్తున్నాయి.
న్యూఢిల్లీ : యువతలో గుండె పోటు (Heart Attack) మరణాలు ఇటీవల పెరుగుతున్నాయి. హార్ట్ ఎటాక్‌తో ఎందరో యువకులు కుప్పకూలిన వీడియోలు సోషల్‌మీడియాలో వెలుగుచూస్తున్నాయి. తాజాగా యూపీలోని ఘజియాబాద్‌లో 21 ఏండ్ల యువకుడు జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ కుప్పకూలాడు.
గుండెపోటు కారణంగానే యువకుడు మరణించినట్టు భావిస్తున్నారు. బాధితుడు నోయిడాలోని ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కాగా, అతడు తల్లితండ్రులకు ఒక్కడే కొడుకు కావడం గమనార్హం. ఖోదా తానా పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస్వతి విహార్‌లో యువకుడు నివసిస్తున్నాడు.
గుండెపోటుతో కుప్పకూలే ముందు బ్లూ టీషర్ట్ ధరించిన యువకుడు ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ కొద్దిసేపు విరామం తీసుకోవడం వీడియోలో కనిపించింది. ట్రెడ్‌మిల్‌పై పడిపోయిన యువకుడిని అక్కడున్న వారు ఆస్పత్రికి తరలించారు.
జీవనశైలి మార్పులతో హృద్రోగాలకు చెక్
ఆధునికజీవనశైలిలో మార్పులు, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, నిద్రలేమి, మద్యపానం, ధూమపానం వంటి కారణాలతో పాటు కుటుంబ చరిత్ర కూడా యువతలో గుండెపోటుకు దారితీస్తున్నాయని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆల్కహాల్, స్మోకింగ్‌కు దూరంగా ఉండటం, వ్యాయామంతో పాటు రోజుకు కనీసం ఏడు గంటల పాటు నిద్ర వంటి జాగ్రత్తలతో యువతలో హృద్రోగాలను నివారించవచ్చని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలతో పాటు నట్స్, తృణధాన్యాలను ఆహారంలో తరచూ తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read More :
Fire Accident | హోటల్లో అగ్నిప్రమాదం : వాహనాలు దగ్ధం
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- heart attack
- running
- Treadmill
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

