Viral Video : ఉదయాన్నే హాట్ కాఫీ కాస్త గొంతులో దిగకుంటే ప్రపంచంలో చాలా మందికి రోజు ప్రారంభం కాదు. కాఫీ ఉదయాన్నే కోట్ల మందికి మూడ్, ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది. ఓ కప్పు కాఫీ అందుకే గ్లోబల్ కంఫర్ట్ డ్రింక్‌గా పేరొందింది. అయితే మనం ఎలాంటి స్ట్రాంగ్ కాఫీని ప్రిఫర్ చేస్తాం..మొత్తం కాఫీ పౌడర్ బాటిల్‌ను కలిపేంత అయితే కాదని సమాధానం చెబుతాం.
వినటానికి ఇది విడ్డూరంగా అనిపించినా ఓ వ్యక్తి ఇలాంటి పనే చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఇన్స్టాగ్రాం ఫుడ్ పేజ్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో వ్యక్తి కాఫీ జార్ ప్యాక్‌ను ఓపెన్ చేసి నేరుగా అందులో మరిగించిన నీటిని పోయడం కనిపిస్తుంది. జార్లో సగానికి పైగా నీటిని పోసిన తర్వాత అతడు స్పూన్‌తో మిక్స్ చేయడం చూడొచ్చు.
కాఫీ పౌడర్ ద్రవరూపంలోకి మారగానే దాన్ని ఓ మగ్లోకి తీసుకుని సిప్ చేస్తాడు. ఆపై అతడి ఎక్స్ప్రెషన్ చూస్తే బాగా నిరుత్సాహానికి గురైనట్టు కనిపించింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తలోరకంగా రియాక్టయ్యారు. ఒకరోజు అతడు ఇక పోస్ట్‌లు చేయడు..కారణం ఏంటో మనకు తెలుసని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఈ కాఫీ ఏకంగా అతడిని స్వర్గంలోనే మేల్కొలుపుతుందని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :