Taffic Rules | ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ లో రికార్డు.. ఏకంగా 70 చలాన్లు అందుకున్న యూపీ వ్యక్తి
Taffic Rules | దేశంలో నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల రక్షణ కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు కఠినతరం చేశారు. అలా కాదని ట్రాఫిక్ రూల్స్ ను ఎవరైనా బ్రేక్ చేస్తే అంతే.. వారి జోబులకు చిల్లు పడుతుంది. ట్రాఫిక్ పోలీసులు భారీగా పైన్ వేసేస్తున్నారు. అలా ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేసిన ఓ వ్యక్తికి పోలీసులు భారీగా చలాన్లు (traffic tickets) వడ్డించారు.
Taffic Rules | దేశంలో నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల రక్షణ కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు కఠినతరం చేశారు. బైక్ ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాల్సిందే. అదేవిధంగా బైక్ పై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి. ఇక కార్లల్లో వెళ్లేవాళ్లు తప్పనిసరిగా సీటు బెల్టు పెట్టుకోవాలి. ఎవరైనా సరే వాహనం నడిపేటప్పుడు మద్యం సేవించకూడదు. ఇక సిగ్నల్ జంప్ చేయకూడదు. అలా కాదని ట్రాఫిక్ రూల్స్ ను ఎవరైనా బ్రేక్ చేస్తే అంతే.. వారి జోబులకు చిల్లు పడుతుంది. ట్రాఫిక్ పోలీసులు భారీగా పైన్ వేసేస్తున్నారు.
అలా ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేసిన ఓ వ్యక్తికి పోలీసులు భారీగా చలాన్లు (traffic tickets) వడ్డించారు. నగరంలో అత్యధిక చలాన్లు పొందిన పది వాహనాల జాబితాను ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) గోరఖ్ పూర్ (Gorakhpur) ట్రాఫిక్ పోలీసులు తాజాగా విడుదల చేశారు. అందులో ఓ వ్యక్తి ఏకంగా ఏడాదిన్నరలో 70 చలాన్లు అందుకుని మొదటి స్థానంలో నిలిచాడు.
సదరు వ్యక్తి ఈ ఏడాదిలో 33 చలాన్లు అందుకోగా.. 37 చలాన్లు గతేడాది అందుకున్నాడు. ఫలితంగా రూ.85,000 విలువ చేసే అతని వాహనంపై ఇప్పటి వరకు రూ.70,500 చలాను పడింది. ఈ జాబితాలో మరో తొమ్మిది మంది కూడా ఎక్కువ చలాన్లు అందుకున్నారు. వీరిలో కొందరికి ట్రాఫిక్ రూల్స్ (Taffic Rules) బ్రేక్ చేసినందుకు 50 కంటే ఎక్కువసార్లు ఫైన్ పడింది.
గోరఖ్ పూర్ పోలీసు యంత్రాంగం రోడ్డు భద్రతకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పలు కూడళ్లలో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు సిగ్నల్ నిబంధనలను ఉల్లంఘించే వాహనాల నంబర్ ప్లేట్లను క్యాప్చర్ చేస్తాయి. ఫలితంగా వారికి పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. ఫైన్ కట్టని వారి వాహనాలను సీజ్ చేసి.. జరిమానా చెల్లించిన తర్వాతనే విడుదల చేస్తున్నారు.
Also Read..
Couple Romance | బైక్ పై ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయిన యువ జంట.. వీడియో
Buddhadeb Bhattacharya | పురుషుడిలా మారనున్న బెంగాల్ మాజీ సీఎం కుమార్తె
Imran Khan | ఇమ్రాన్ ఖాన్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

