న్యూఢిల్లీ : విమానంలో వాదవివాదాలు, ఘర్షణలకు సంబంధించిన వైరల్ వీడియోలు (Viral video) సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. లేటెస్ట్గా విస్తారా ఫ్లైట్‌లో సహ ప్రయాణీకుడితో ఓ వ్యక్తి ఘర్షణకు దిగిన వీడియో నెట్టింట వైరలవుతోంది. విమానంలో ఉన్న ఓ ప్రయాణీకుడు ఈ వీడియోను రికార్డు చేసి ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వైరల్ క్లిప్‌లో ఓ వ్యక్తి తన కూతురిని బెదిరించిన వ్యక్తితో ఘర్షణ పడటం కనిపిస్తుంది.
Kalesh Inside the vistara flight b/w Two man over a guy touched another man Daughter pic.twitter.com/BTlS1EHhma
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 2, 2023
తన కూతురుని హెచ్చరించడానికి ఎంత ధైర్యమని అతడిని నిలదీశాడు. వీరిద్దరినీ వారించి పరిస్ధితిని చక్కదిద్దేందుకు క్యాబిన్ సిబ్బంది ప్రయత్నించడం చూడొచ్చు. ఈ వీడియోను పెద్దసంఖ్యలో నెటిజన్లు వీక్షించారు. సీటు విషయంలో యువతితో తోటి ప్రయాణీకుడి మధ్య జరిగిన వివాదం ఈ ఘర్షణకు దారితీసిందని ఎయిర్‌లైన్ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ ఘటన ముంబై నుంచి డెహ్రాడూన్ వెళుతున్న విస్తారా విమానంలో జరిగిందని పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇక గతంలోనూ పలు విమానాల్లో ప్రయాణీకుల మధ్య ఘర్షణ చెలరేగిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
Read More :