Animal Movie Post Poned | మూడు వారాల ముందు రిలీజైన యానిమల్ ప్రీ-టీజర్ యూట్యూబ్‌లో సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే మిలయన్ల వ్యూస్‌తో దూసుకుపోయింది. ప్రీ-టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి మేకర్స్ సైతం ఆశ్చర్యపోయారు. సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్వూలో అందరూ కబీర్ సింగ్‌ను వైలెంట్ ఫిలిం అంటున్నారు. అసలైన వైలెంట్ సినిమా అంటే ఏంటో నా తర్వాతి సినిమాలో చూపిస్తా అని బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. చెప్పినట్టుగానే అసలు సిసలు వైలెంట్ సినిమా చూపించబోతున్నట్లు ప్రీ-టీజర్‌తో స్పష్టం చేశాడు. ప్రీ టీజర్‌తోనే సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొల్పాడు. ఇండియాలోనే ది మోస్ట్ వైలెంట్ సినిమాగా సందీప్ యానిమాల్ సినిమాను రూపొందిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్.
ఇక ఈ సినిమాను ఆగస్టు 11న తీసుకొస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. అయితే ఆ మధ్య పోస్ట్ పోన్ అంటూ వార్తలు వచ్చినా.. అవన్ని పుకార్లని, చెప్పిన డేట్‌కు సినిమా వస్తుందని బల్ల గుద్ది చెప్పారు. మళ్లీ ఏమైందో తెలియదు కానీ సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తాజాగా అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను ఏకంగా పదిహేను వారాలు పోస్ట్ చేస్తూ డిసెంబర్ 1న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. షూటింగ్ పూర్తయిపోయినప్పటికీ, ప్యాచ్ వర్క్ చాలా వరకు పెండింగ్ ఉందట. రెండు నెలల్లో పెండింగ్ పని పూర్తి చేసి ప్రమోషన్లు చేయడం అసాధ్యమని భావించి సినిమాను పోస్ట్ పోన్ చేశారని టాక్.
పైగా అదే రోజున టాలీవుడ్లో చిరు భోళా శంకర్, కోలీవుడ్‌లో రజనీ జైలర్ సినిమాలు విడుదవుతున్నాయి. యానిమల్ ఎంత స్ట్రాంగ్ కంటెంట్‌తో వస్తున్నా.. ఈ సీనియర్ హీరోల సినిమాలకు కాస్త పాజిటీవ్ టాక్ వస్తే పోటీగా ఎంత తోపు సినిమా ఉన్నా సైడ్ ఇవ్వాల్సిందే. వీళ్లను అస్సలు తక్కువంచనా వేయడానికి లేదు. యావరేజ్ టాక్ తెచ్చుకున్న వీరయ్య రెండొందల కోట్లుకు పైగా కలెక్షన్లు, డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న అన్నాతే రెండొందల యాభై కోట్ల రేంజ్లో కలెక్షన్లు సాధించిందంటే మాస్ మార్కెట్లలో వీళ్ల ప్రభావం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా అటు హిందీలోనూ గదర్-2 రూపంలో పెద్ద కాంపిటీషన్ ఉంది.
వీటిన్నిటి దృష్టిలో పెట్టుకుని మేకర్స్ సినిమాను పోస్ట్ పోన్ పోన్ చేశారు. రివేంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్‌కు జోడీగా రష్మిక నటిస్తుంది. ఇటీవలే తన షూటింగ్ కంప్లీట్ అయినట్లు ఈ బ్యూటీ సెట్స్‌లో దిగిన ఫోటోను అభిమానులుతో పంచుకుంది. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడీయోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
Animal New Release date || Dec 1st 2023@AnilKapoor #RK @iamRashmika @thedeol @tripti_dimri23 @imvangasandeep #BhushanKumar @VangaPranay @MuradKhetani #KrishanKumar @anilandbhanu @VangaPictures @Cine1Studios @TSeries @rameemusic @cowvala #SundarSomasundaram @sureshsrajan pic.twitter.com/XBBowgjGSK
— Bhadrakali Pictures (@VangaPictures) July 3, 2023