బెంగళూరు: పొడవైన కత్తితో చర్చిలోకి ప్రవేశించిన ఒక వ్యక్తి ఫాదర్ వెంటపడ్డాడు. గమనించిన చర్చి ఫాదర్ అక్కడి నుంచి పరుగులు తీశారు. దీంతో అతడు పారిపోయాడు. కర్ణాటకలోని బెళగావిలో ఈ ఘటన జరిగింది. శనివారం మధ్యాహ్నం బాక్సైట్ రోడ్డులోని చర్చిలోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. అతడి ఒక చేతిలో పొడవైన కత్తి, మరో చేతిలో వైర్ ఉన్నది. ఆ వ్యక్తి కత్తిని చేతితో పట్టుకుని చర్చి ఇంచార్జ్ అయిన ఫాదర్ ఫ్రాన్సిస్ డిసౌజా వెంటపడ్డాడు. గమనించిన ఆయన వెంటనే పరుగున ఒక పక్కకు వెళ్లారు.
కాగా, ఫాదర్ ఉరుకుతూ రావడాన్ని చూసిన కొందరు ఆయన వద్దకు వస్తుండటంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ చర్చి వద్ద భద్రతను పెంచారు.
మరోవైపు కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 13న బెళగావిలో ప్రారంభంకానున్నాయి. ప్రతిపక్షాలు, క్రైస్తవ సంఘాలు వ్యతిరేకిస్తున్న మత మార్పిడి వ్యతిరేక బిల్లును ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు బెళగావిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
A man welding sword threatens father Francis of the St Joseph's Church in #Belagavi #Karnataka. After locals spotted him. He escaped from there. His movement caught on CCTV camera. Cops suspect he was there to steal from the store room of the church. pic.twitter.com/xKFisKPGE1
— Imran Khan (@KeypadGuerilla) December 12, 2021