మహాకుంభ్ నగర్: మమతా కులకర్ణి రాజీనామా తిరస్కరణకు గురి కావడంతో ఆమె కిన్నర్ అఖాడా ‘మహా మండలేశ్వర్’గా కొనసాగనున్నారు. గత నెల 24న ఆమెను ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో మహా మండలేశ్వర్గా ప్రకటించారు. దీంతో అఖాడాలో సభ్యుల మధ్య వివాదాలు చెలరేగాయి. చేరిన కొత్తలోనే ఆమెకు ‘మహా మండలేశ్వర్’ లాంటి అత్యున్నత హోదాను కట్టబెట్టడాన్ని కొందరు వ్యతిరేకించారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 10న తాను అఖాడాకు రాజీనామా చేస్తున్నానని కులకర్ణి ప్రకటించారు. అయితే తన రాజీనామాను తిరస్కరించారని గురువారం ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ‘మహా మండలేశ్వర్గా నా రాజీనామా ఆమోదం పొందలేదు. ఆచార్య లక్ష్మీనారాయణ త్రిపాఠి నన్ను అదే హోదాలో కొనసాగమన్నందుకు నేను కృతజ్ఞురాలిని’ అని మమత పేర్కొన్నారు.