కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) తరపున న్యాయవాది.. ఎస్ఎస్కేఎం ఆస్పత్రితో పాటు బంగుర్ ఇన్స్టిట్యూట్ ఆప్ న్యూరోసైన్సెస్‌కు లీగల్ నోటీసులు జారీ చేశారు. దీదీకి చెందిన 2021 నాటి మెడికల్ రికార్డులను అనుమతి లేకుండా రిలీజ్ చేసిన కేసులో ఆ ఆస్పత్రులకు నోటీసు ఇచ్చారు. 2021 నందిగ్రామ్ ఎన్నికల ప్రచారంలో తన కాలుకు గాయమైనట్లు మమతా బెనర్జీ ఫేక్ మెడికల్ రిపోర్టు రిలీజ్ చేసిందని ప్రస్తుత సీఎం సువేంధు అధికారి ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఓ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ… మమతా బెనర్జీ కాలుకు ఫ్రాక్చర్ కాలేదని, రేడియాలజీ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఫేక్ రిపోర్టును ఆయన మీడియాకు చూపించారు.
2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమతా ఆడిన నకిలీ నాటకం గుట్టు విప్పుతామని అధికారి పేర్కొన్నారు. సీఎం సువేంధు వ్యాఖ్యల నేపథ్యంలో.. మమతా బెనర్జీ లాయర్ ఆర్కా నాగ్.. బంగుర్ ఆస్పత్రి డైరెక్టర్‌కు, ఎస్ఎస్కేఎం సూపరిండెంట్‌కు నోటీసును ఈమెయిల్ చేశారు. తమ క్లయింట్‌కు చెందిన మెడికల్ రికార్డులు ఎలా సీఎం సువేంధు అధికారి వద్దకు వెళ్లాయో చెప్పాలని కోరారు. ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శికి కూడా నోటీసు కాపీని పంపారు. ఒకవేళ అధికారికంగా మెడికల్ రికార్డులను తీసుకున్నా.. ఆ విషయాన్ని పబ్లిక్‌గా చెప్పడం సరి కాదు అని లాయర్ తన నోటీసులో పేర్కొన్నారు. బయట పెట్టిన మెడికల్ రికార్డులు.. ఒరిజినలా కాదా అని వెల్లడించాలని లాయర్ కోరారు.