మంగళవారం 14 జూలై 2020
National - Jun 30, 2020 , 21:53:03

పశ్చిమబెంగాల్‌లో జూన్‌ 2021వరకు ఉచిత రేషన్‌

పశ్చిమబెంగాల్‌లో జూన్‌ 2021వరకు ఉచిత రేషన్‌

కోల్‌కత్తా : ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన పథకాన్ని ప్రధాని మోదీ నవంబర్‌ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలో వచ్చే ఏడాది జూన్‌ వరకు ఉచిత రేషన్‌ పథకాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ పథకంతో రాష్ట్రంలో కేవలం 60శాతం మంది ప్రజలకు మాత్రమే ఉచితంగా రేషన్‌ అందే అవకాశముందని సగం మందికి మాత్రమే రేషన్‌ ఇచ్చి తేడాలెందుకు చూపుతున్నారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత రేషన్‌ ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన 59యాప్స్‌ను నిషేధించడాన్ని ఆమె ప్రస్తావిస్తూ.. చైనా విషయంలో ప్రజలంతా ఆవేశంగా ఉన్నారని దానికి ధీటైన సమాధానం చెప్పాలి తప్పా ఇలా యాప్స్‌ను నిషేధిస్తే ఫలితం ఉండదన్నారు. రాష్ట్రంలో మెట్రోరైలు సేవలకు అనుమతించాలని కేంద్రాన్ని కోరారు. మెట్రోరైళ్లను, విమాన సర్వీసులను ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాసినట్లు తెలిపారు.   


logo