కోల్కతా, జూన్ 19: విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈ నెల 21న(మంగళవారం) నిర్వహించనున్న సమావేశానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమత హాజరు కావడం లేదు. టీఎంసీ పార్టీ నేత ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ముందుగా నిర్ణయించిన వేరే కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉన్నందున మమత ఈ సమావేశానికి హాజరు కావడం లేదన్నారు. టీఎంసీ నుంచి సీనియర్ నేత ఈ భేటీకి హాజరవుతారని తెలిపారు. విపక్షాల సమావేశాన్ని మొదట మమత ఈ నెల 15న ఏర్పాటు చేశారు. 17 పార్టీల నుంచి నేతలు హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం రాలేదు. దీంతో మళ్లీ 21న సమావేశం అవుదామని పవార్ ప్రతిపాదించారు.