మరోసారి గోవాకు మమత.. రెండు రోజులు పర్యటన

పనాజి: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి గోవా వెళ్లారు. గోవా అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారించిన ఆమె ఆదివారం గోవా చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడ పర్యటిస్తారు. సోమవారం, మంగళవారం గోవాలోని టీఎంసీ నేతలతో మమత సమావేశమవుతారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గోవా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి క్రియాశీలక రాజకీయాలపై ఆమె దృష్టిసారించారు. అక్టోబర్ చివరి వారంలో గోవాలో మమత నాలుగు రోజులు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్, కాంగ్రెస్ నాయకురాలు, నటి నఫీసా అలీ టీఎంసీలో చేరారు.
మరోవైపు తాజాగా మమతతోపాటు టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, ఆ పార్టీలో చేరిన బీజేపీ మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కూడా ఆదివారం గోవా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా గోవాకు చెందిన పలువురు ప్రముఖులు టీఎంసీలో చేరవచ్చని తెలుస్తున్నది. గోవా మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీపీ ఎమ్మెల్యే అలెమా చర్చిల్తోపాటు మరికొందరు టీఎంసీలో చేరుతారని సమాచారం.
కాగా, అలెమా 2014లో టీఎంసీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ గోవా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఎన్సీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

